పంచాయతీ ఎన్నికలు జరిగే వరకు స్పెషల్ ఆఫీసర్ పాలనలో ఉన్నాయి గ్రామీణ ప్రాంతాలు. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో కొన్ని చోట్ల అధికారులు ఆడింది ఆట.. పాడింది పాటగా సాగింది. ఈ క్రమంలో కొందరు భారీగా అక్రమాలకు పాల్పడినట్లు చెబుతున్నారు. ఇప్పుడా భాగోతాలు వెలుగులోకి రావడంతో ఓ కీలక అధికారి చక్రం తిప్పుతున్నారు. గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్ల మేత! కృష్ణాజిల్లాలోని నాలుగు డివిజన్ల పరిధిలో మొత్తం వెయ్యికిపైగా పంచాయతీలు ఉన్నాయి. విజయవాడ రూరల్ డివిజన్లోని మేజర్ పంచాయతీల ఆదాయం…