కృష్ణా డెల్టా రైతులకు ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు శుభవార్త తెలిపారు. జూన్ పదో తేదీ నుండి కృష్ణా డెల్టాకు సాగు నీరు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి అంబటి తెలిపారు. ఎమ్మెల్యే ఉదయభానుతో కలిసి పులిచింతల ప్రాజెక్టుని సందర్శించారు మంత్రి అంబటి రాంబాబు. గత ఏడాది ఆగస్టులో కొట్టుకుపోయిన గేటు ప్రాంతాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు మంత్రి. గతంలో ఎప్పుడూ లేని విధంగా జూన్ లోనే సాగునీరు ఇవ్వనున్నాం. పులిచింతలలో 33 టీఎంసీల నీరు…