5 Dead in Kothakota Road Accident: వనపర్తి జిల్లా కొత్తకోట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున కొత్తకోట బైపాస్ టేక్కలయ్య దర్గా సమీపంలో 44వ జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారిలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. హాస్పిటల్ కు తరలిస్తుండగా చిన్నారి మృతి చెందింది. ఈ ఘటనలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా…