Driverless Car : అమెరికాలోని సాన్‌ఫ్రాన్సిస్కో నగరంలో ఒక చిన్న పిల్లి మరణం పెద్ద సంచలనంగా మారింది. ప్రాంత ప్రజలందరికీ ఇష్టంగా మెలిగిన ‘కిట్‌క్యాట్’ అనే పిల్లి ఇటీవల ఒక డ్రైవర్ లేని టాక్సీ (రోబోటాక్సీ) కింద పడి ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటనతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలందరి మనసును గెలుచుకున్న కిట్‌క్యాట్‌ను “16వ వీధి మేయర్” అని ప్రేమగా పిలిచేవారు. ఎప్పుడూ వీధుల్లో తిరుగుతూ, షాపుల్లో, రెస్టారెంట్లలో అందరితో మమేకమై ఉండే…