Kite Festival: సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్ వేదికగా ‘అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ 2026’ ప్రారంభమైంది. రంగురంగుల పతంగులతో భాగ్యనగర ఆకాశం ఒక అద్భుతమైన కాన్వాస్‌లా మారిపోయింది. తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకలో ప్రపంచం నలుమూలల నుంచి కైట్ ఫ్లయర్స్ తరలివచ్చారు. రష్యా, పోర్చుగల్, సింగపూర్, శ్రీలంక, థాయిలాండ్, ఉక్రెయిన్, వియత్నాం, జపాన్, ఇటలీ, ఫ్రాన్స్, కెనడా, ఆస్ట్రేలియా వంటి 19 దేశాల నుండి 40 మంది నిపుణులు తమ నైపుణ్యాన్ని…