డిజిటల్ ప్రపంచాన్ని ఒక్కసారిగా షేక్ చేసిన పరిణామం ఇది. భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ అకస్మాత్తుగా డీయాక్టివేట్ అయింది. దాంతో 274 మిలియన్ల (27 కోట్ల 40 లక్షలు) ఫాలోవర్స్ అయోమయంలో పడిపోయారు. శుక్రవారం (జనవరి 30) ఉదయం నుంచే కింగ్ ఇన్‌స్టా ప్రొఫైల్ పూర్తిగా మాయమైంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ‘Virat Kohli’ అని సెర్చ్ చేస్తే.. ప్రొఫైల్ కనిపించడం లేదు. ‘దిస్ పేజ్ ఈజ్ నాట్ అవైలబుల్’, ‘ది లింక్ మే బీ…