ప్రపంచంలో సమర్థవంతమైన, అత్యంత శక్తివంతమైన ఆయుధాలను తయారు చేసేందుకు అగ్రరాజ్యాలు సిద్దమవుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, రోబోటిక్ టెక్నాలజీని బేస్ చేసుకొని స్వీయ నియంత్రిత కిల్లర్ రోబోట్స్‌ను తయారు చేసేందుకు చైనా, అమెరికా, రష్యా దేశాలు సన్నాహాలు చేస్తున్నాయి. రోబోటిక్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత అనేక రంగాల్లోకి రోబోలు ప్రవేశించాయి. అయితే, ఇప్పటి వరకు ప్రొగ్రామ్ ఆపరేటింగ్ లేదా రిమోట్ కంట్రోల్ తో పనిచేసే రోబోలు అందుబాటులో ఉండగా, ఇప్పుడు స్వీయ నియంత్రిత రోబోలను అందుబాటులోకి రాబోతున్నాయి.…