తెలుగులో మాస్ మహారాజ రవితేజ నటించిన “ఖిలాడీ” సినిమా న్యాయపరమైన చిక్కుల్లో పడింది. మూవీ విడుదలైన ఒక రోజు తర్వాత బాలీవుడ్ నిర్మాత రతన్ జైన్ ఈ సినిమా నిర్మాతలపై ఢిల్లీ హైకోర్టులో కేసు వేశారు. తెలుగు సినిమా నిర్మాతలు తన అనుమతి లేకుండా అక్షయ్ కుమార్ హీరోగా నటించిన 1992 సూపర్ హిట్ మూవీ ‘ఖిలాడీ’ అనే తన సినిమా టైటిల్‌ను ఉపయోగించారని ఆరోపించారు. చిత్రనిర్మాత రతన్ జైన్ మాట్లాడుతూ “మేము సమర్పకుడు, నిర్మాతపై కేసు…
మాస్ మహారాజ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ “ఖిలాడీ”. రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను ఎ స్టూడియోస్ ఎల్ఎల్పి పతాకంపై సత్యనారాయణ కోనేరు, వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచారు. ఇందులో యాక్షన్ కింగ్ అర్జున్, ముకుందన్, మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మొదట్లో ఈ సినిమాను 28 మే 2021 న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కోవిద్-19…
ఈ ఏడాది మొదట్లోనే “క్రాక్” చిత్రంతో మంచి విజయం అందుకున్నాడు మాస్ మహారాజ రవితేజ. ఆ సినిమా ఇచ్చిన జోష్ తో వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు. ప్రస్తుతం రవితేజ “ఖిలాడీ” అనే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ లో నటిస్తున్నారు. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. రమేష్ వర్మ చివరగా “రాక్షసుడు” చిత్రంతో హిట్ అందుకున్నాడు. సత్యనారాయణ కోనేరు “ఖిలాడీ” చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవితేజ సరసన మీనాక్షి చౌదరి,…