BJP: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బుధవారం వయనాడ్ లోక్‌సభ స్థానానికి ప్రియాంకాగాంధీ నామినేషన్ వేసే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ అట్టహాసంగా నిర్వహించింది. నామినేషన్ వేస్తున్న సమయంలో మల్లికార్జున ఖర్గేని అనుమతించలేదని, గేటు వద్దే ఉంచారని చూపిస్తున్న వీడియో వైరల్‌పై బీజేపీ స్పందించింది.