కరోనా సెకండ్ వేవ్ సౌత్ సినిమా ఇండస్ట్రీ ముందుగా చేసుకున్న ప్లాన్స్ అన్నింటినీ మార్చేసింది. ఈ మహమ్మారి కారణంగా ఇప్పటికే విడుదల కావాల్సిన ఎన్నో సినిమాలు ఇంకా విడుదల కాలేదు. చాలా రోజుల తరువాత ఇప్పుడిప్పుడే వెండితెరపై బొమ్మ పడుతోంది. దీంతో విడుదల వాయిదా వేసుకున్న పెద్ద సినిమాలన్నీ రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ సౌత్ లో మాత్రం భారీ పోటీ నెలకొంది. ఇప్పటికే సంక్రాంతి రేసులో టాలీవుడ్ బిగ్…