తెలంగాణ రాజకీయాల్లో నిర్మాత కేదార్ అనుమానాస్పద మృతి సంచలనంగా మారింది. దుబాయ్ పోలీసులు అనుమానాస్పద మృతిగా పరిగణిస్తున్నారు. మూడు రోజులైన మృతదేహం ఇంకా దుబాయ్‌లోనే ఉంది. దర్యాప్తు పూర్తయితేనే హైదరాబాద్‌కు మృతదేహాన్ని పంపనున్నారు. ర్యాడిసన్ డ్రగ్ కేసులో కేదార్ నిందితుడిగా ఉన్నాడు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులకు దుబాయ్‌లో పెట్టుబడులు, ఆస్తులు కొనిపెట్టడంలో మధ్య వర్తిగా కేదార్ ఉన్నట్లు తెలుస్తోంది.