US Iran Tension: ఇరాన్‌పై అమెరికా దాడికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు తగ్గట్లే అన్ని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీకి వ్యతిరేకంగా ఆ దేశంలో భారీ ఎత్తున ప్రజలు ఉద్యమిస్తున్నారు. మరోవైపు, ఈ నిరసనల్ని అణిచివేసేందుకు ఇరాన్ మతపాలకులు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు, ఈ నిరసనల్లో దాదాపుగా 500 మంది వరకు చనిపోయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, ఉరిశిక్షల్ని ఉపయోగించి నిరసనల్ని క్రూరంగా అణగదొక్కాలని భావిస్తోంది.…