తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరో మోసం చేసిందన్నారు మంత్రి కేటీఆర్. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టే అవకాశం లేదన్న కేంద్రమంత్రి ప్రకటనపై తీవ్రంగా స్పందించిన కేటీఆర్, తెలంగాణకి ప్రతి విషయంలోనూ ద్రోహం చెయ్యడమే బీజేపీ నైజమని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోడీ నుంచి ప్రతి రాష్ట్ర బీజేపీ నేతా, తెలంగాణకు వ్యతిరేకులేనని విమర్శించారు. స్టేట్ బీజేపీ లీడర్లకు దమ్ముంటే, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కోసం కేంద్రాన్ని నిలదియ్యాలని సవాల్ విసిరారు కేటీఆర్. Read Also:…