కార్తీక కృష్ణ చతుర్థి నాడు మహిళలు ‘కర్వా చౌత్’ ఉపవాసం పాటిస్తారు. ఈ ఏడాది అక్టోబర్ 10న కర్వా చౌత్ వస్తోంది. దాంతో ఉత్తర భారతదేశంలో పండుగ శోభ ఉట్టిపడుతోంది. మహిళలు తమ భర్తల దీర్ఘాయుష్షు, ఆరోగ్యం, శ్రేయస్సు కోసం చేసే ఈ పండుగను అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఉత్తర భారతదేశంలో మహిళలు తమ భర్తల దీర్ఘాయుష్షు కోసం నీరు కూడా తాగకుండా ఉపవాసం ఉంటారు. వివాహిత మహిళలు రాత్రి చంద్రుడి పూజ అనంతరం ఉపవాసం విరమిస్తారు.…