‘అందాల రాక్షసి’ తో తెలుగు తెరకు పరిచయం అయిన టాలెంటెడ్ హీరో నవీన్ చంద్ర. తన నటనతో మెప్పించినప్పటికీ, కమర్షియల్ హిట్లు మాత్రం కొంత కాలంగా దక్కడం లేదు. అయినా కూడా, ఆయన వినూత్న కథలను ఎంచుకుంటూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. వరుస పెట్టి త్రిల్లింగ్ చిత్రాలతో అలరిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా, సైకలాజికల్ థ్రిల్లర్ ‘హనీ’ సినిమా ద్వారా మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే నవీన్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది.…