వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ యాదవులపై ఎదో మాట్లాడారని కూటమి నాయకులు రాద్ధాంతం చేస్తున్నారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మండిపడ్డారు. అసలు జగన్ ఏం మాట్లాడారు అనేది యాదవ సోదరులతో పాటు అందరూ తెలుసుకోవాలన్నారు. యాదవులకు జగన్ అధిక ప్రాధాన్యత ఇచ్చారని, ద్రోహం చేసింది టీడీపీనే అని పేర్కొన్నారు. టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, యాదవులపై కూటమి ప్రభుత్వం డైవర్షన పాలిటిక్స్ చేస్తోందన్నారు. టీడీఆర్ బాండ్ల వ్యవహారం నడిపింది…