Karthika Masam 2025: కార్తీక మాసం మూడవ సోమవారం కావడంతో దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజమండ్రిలోని స్నాన ఘట్టాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. గోదావరి నదిలో భక్తులు వేలాదిగా తరలి వచ్చి పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. రాజమండ్రి చుట్టూ ప్రక్కల నుండి భారీగా భక్తులు పుష్కరఘాట్ కు తరలి వస్తున్నారు. స్నానాలు ఆచరించి పూజా కార్యక్రమాలు అనంతరం గోదావరి లో కార్తీక దీపాలు వదులుతున్నారు. రాజమండ్రి కోటి లింగాల ఘాట్ , మార్కండేయ ఘాట్, సరస్వతి ఘాట్, గౌతమీ…