కాంగ్రెస్ చారిత్రక తప్పిదాలను ప్రధాని పార్లమెంట్‌లో ప్రస్తావించారు. కాంగ్రెస్ హయాంలోనే పీఓకేను భారత్ కోల్పోయింది.. నెహ్రూ చేసిన తప్పులకు భారత్ ఇప్పటికీ మూల్యం చెల్లిస్తోందని మోడీ అన్నారు.. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి తీసుకున్న నిర్ణయాల పర్యవసానాలను దేశం ఇప్పటికీ అనుభవిస్తోందన్నారు. అక్సాయ్ చిన్ కు బదులుగా, మొత్తం ప్రాంతాన్ని 'బంజరు భూమి'గా ప్రకటించారని.. దీని కారణంగా మనం దేశంలోని 38,000 చదరపు కిలోమీటర్ల భూమిని కోల్పోవలసి వచ్చిందన్నారు.
Kartarpur Gurdwara: పాకిస్థాన్‌లోని సిక్కులకు అత్యంత పవిత్రమైన ప్రదేశమైన కర్తార్‌పూర్ సాహిబ్ గురుద్వారా కాంప్లెక్స్‌లో మత విశ్వాసాలను దెబ్బతీసేందుకు పార్టీని ఏర్పాటు చేసిన ఘటన కలకలం రేపుతోంది.