రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవ పరేడ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటకు సంబంధించిన దర్యాప్తు నివేదిక వచ్చింది. సిద్ధరామయ్య ప్రభుత్వం కర్ణాటక హైకోర్టుకు తన నివేదికను సమర్పించింది. దీనిలో నిర్లక్ష్యం, నిర్వహణ లోపాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల అనుమతి లేకుండా విజయోత్సవ పరేడ్‌కు హాజరు కావాలని ఆర్సీబీ ప్రేక్షకులను ఆహ్వానించిందని నివేదిక పేర్కొంది. జూన్ 4న బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవ పరేడ్‌కు ముందు ఈ తొక్కిసలాట జరిగింది. విక్టరీ పరేడ్‌లో 11 మంది మరణించారు. అదే సమయంలో, 50…