UP Crime: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. జిమ్ ట్రైనర్ మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. బాధితురాలు శిక్షణ పొందుతున్న జిమ్‌లోనే ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాష్ట్రంలోని కాన్పూర్ నగరంలో చోటు చేసుకుంది. ఏడాదిన్నర క్రితం దాఖలైన ఫిర్యాదుపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో, అలహాబాద్ హైకోర్టు జోక్యంతో నిందితుడిని అరెస్ట్ చేశారు.