Kamal Haasan : కమల్ హాసన్ కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలపై అటు కన్నడ హైకోర్టు కూడీ సీరియస్ అయింది. మీరేమైనా చరిత్రకారులా.. కన్నడ భాష తమిళం నుంచి పుట్టిందని మీరెలా అంటారు అని ఆగ్రహం వ్యక్తం చేసింది. సారీ చెబితే అయిపోతుంది కదా అని సూచించింది. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ కన్నడ ఫిల్మ్ ఛాంబర్ కు సుదీర్ఘమైన లేఖ రాశారు. ‘నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నందుకు…
Kamal Haasan: యాక్టర్ కమల్ హాసన్‌ని కర్ణాటక హైకోర్టు తీవ్రంగా మందలించింది. ఇటీవల, ఆయన కొత్త చిత్రం ‘థగ్ లైఫ్’ ప్రమోషన్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘‘కన్నడ తమిళం నుంచి పుట్టింది’’ అని వ్యాఖ్యాలు చేశాడు. అయితే, దీనిపై కర్ణాటకలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. తమ భాషను తక్కువ చేసి మాట్లాడారని, క్షమాపణలు చెప్పాలని, లేకపోతే ఆయన సినిమా కర్ణాటక లో విడుదల కాకుండా అడ్డుకుంటామని కన్నడిగులు హెచ్చరించారు.
ప్రముఖ నటుడు కమల్ హాసన్ తన తాజా చిత్రం “తగ్ లైఫ్” విడుదలకు ముందు కొత్త వివాదంలో చిక్కుకున్నారు. చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కన్నడిగుల ఆగ్రహానికి కారణమయ్యాయి. “మీ భాష (కన్నడ) తమిళం నుంచే పుట్టింది” అని కమల్ హాసన్ అనడం కర్ణాటకలో తీవ్ర దుమారం రేపింది. కమల్ హాసన్ తన ప్రసంగాన్ని “ఉయిరే ఉరవే తమిళే” (నా ప్రాణం, నా బంధుత్వం తమిళం) అంటూ ప్రారంభించారు. ఆ తర్వాత, వేదికపై…