Prepaid Card for Kamineni: కామినేని ఆస్పత్రుల్లో ట్రీట్మెంట్ కోసం ప్రీపెయిడ్ వ్యాలెట్ బ్యాలెన్స్ కార్డును అందుబాటులోకి తెచ్చారు. ఈ మేరకు ఆఫర్డ్ ప్లాన్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ కార్డును ఉపయోగిస్తే క్యాష్ బ్యాక్ ఆఫర్ వర్తిస్తుంది. మందుల పైన, మెడికల్ టెస్టుల పైన డిస్కౌంట్ ఇస్తారు. 10 వేల రూపాయలు మొదలుకొని 10 లక్షల రూపాయల వరకు మెడికల్ లోన్ కూడా అందిస్తారు.