ఈరోజు ముంబైలో పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్న ప్రధాని మోడీ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈరోజు దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా దాదాపు 29, 400 కోట్ల రూపాయలతో చేపట్టనున్న వివిధ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. ముంబైలోని గోరేగావ్‌లోని నెస్కో ఎగ్జిబిషన్ సెంటర్‌కు సాయంత్రం 5.30 గంటలకు చేరుకోనున్న ప్రధాని.. అక్కడ రోడ్లు, రైల్వేలు, ఓడరేవు రంగాలకు సంబంధించిన పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. దీని తర్వాత సాయంత్రం 7…