MLC Kavitha : రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గ పర్యటనలో పాల్గొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనను టార్గెట్ చేసిన ఆమె, ఈ ప్రభుత్వం ప్రజలకు సేవ చేయడం కంటే ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని ఆరోపించారు. రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి తరచూ వెళ్లే వ్యక్తిగా, రాష్ట్రానికి తక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల ముందు అమ్మాయిలకు స్కూటీలు, పెళ్లికి లక్ష రూపాయల…