Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటేసింది. ఇవాళ (సోమవారం) ఉదయం 11.30 గంటలకు ఒడిశా రాష్ట్రం పూరీ సమీపంలోని గోపాల్‌పుర్ దగ్గర తీరం దాటినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఆదివారం రాత్రి 9:30 గంటల ప్రాంతంలో గులాబ్ తుఫాన్ గోపాల్‌పూర్-కళింగపట్నం వద్ధ తీరం దాటింది. కళింగపట్నానికి 20 కిలోమీర్ల దూరంలో ఉత్తరభాగంలో తీరాన్ని దాటింది. తీరాన్ని దాటే సమయంలో 95 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచాయి. ఇక ఆదివారం ఉదయం నుంచే శ్రీకాకుళం జిల్లాలో వానలు దంచికొట్టాయి. కళింగపట్నం వద్ద తీరం దాటటంతో ఆ పట్టణం అతాకుతలం అయింది. ఆదివారం రోజున 19.4 సెం.మీ వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం జిల్లాతో పాటుగా విజయనగరం, విశాఖ జిల్లాలో విస్తారంగా…