హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’. అందులో వచ్చే నెల జూన్ 4న టొవినో థామస్ కథానాయకుడిగా నటించిన మోస్ట్ అవెయిటెడ్ యాక్షన్ డ్రామా ‘కాలా’ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ ఏడాది ప్రథమార్థంలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది. ఓ హింసాత్మక ఘటనలో చనిపోయే కుక్క కారణంగా ఇద్దరి వ్యక్తుల మధ్య ఆసక్తికరమైన భావోద్వేగాలతో నడిచే కథే ‘కాలా’. టొవినో థామస్, సుమేష్ మూర్, దివ్యా పిళ్లై, లాల్…