నేటి కాలంలో ఆరోగ్యకరమైన ఆహారం కోసం వెతుకుతున్న వారికి.. ఉత్తర ప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్ ప్రాంతంలో పండే ‘కాలా నమక్’ బియ్యం ఒక అద్భుతమైన ఎంపికగా నిలుస్తున్నాయి. దాదాపు 2,600 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ బియ్యాన్ని గౌతమ బుద్ధుడి కాలంలో సాగు చేసేవారు, అందుకే దీనిని ‘బుద్ధ బియ్యం’ (Buddha Rice) అని కూడా పిలుస్తారు. నల్లటి పొట్టుతో ఉండి, ఉడికించినప్పుడు తెల్లగా, సువాసనభరితంగా మారే ఈ బియ్యంలో ఐరన్, జింక్.. ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా…