కాకినాడలో ఎస్సై గోపాలకృష్ణ వ్యవహారం మలుపులు తిరుగుతోంది. అధికారు వేధింపులు, అవమానాల వల్లే బలవన్మరణానికి పాల్పడినట్టు ఆరోపణలు వస్తున్నాయి. కుటుంబ సభ్యుల్ని కూడా మాట్లాడనివ్వకుండా పోలీసులు ఆంక్షలు విధించడం పలు అనుమానాలకు తావిస్తోందని విపక్ష నేతలు విమర్శిస్తున్నారు. టీడీపీ సీనియర్ నేత. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు. ఎస్సై ముప్పవరపు గోపాలకృష్ణ ఆత్మహత్య మొత్తం పోలీసు శాఖకే అవమానం. వైసీపీ ప్రభుత్వ హయాంలో పోలీసు శాఖలో ఉన్న కులవివక్షకు ఇదొక నిదర్శనం…