టాలీవుడ్ లెజెండరీ నటుడు కైకాల సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స జరుగుతోంది. 86 ఏళ్ల కైకాల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరగా అప్పటి నుండి వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనను పరామర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసినట్టు సమాచారం. Read Also : పవన్, ఎన్టీఆర్, మహేష్…
సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ స్వల్ప అస్వస్థత పాలయ్యారు. నాలుగు రోజుల క్రితం ఆయన ఇంట్లో జారిపడినట్టు తెలుస్తోంది. శనివారం రాత్రి పెయిన్స్ ఎక్కువగా వుండడంతో సికింద్రాబాద్ లోని ప్రముఖ హాస్పిటల్ లో కుటుంబ సభ్యులు జాయిన్ చేశారు. ప్రస్తుతం కైకాల ఆరోగ్యం గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు కుటుంబ సభ్యులు. కైకాల ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఇంట్లోనే ఉంటున్నారు. ఎన్టీఆర్ కథానాయకుడు, మహర్షి చిత్రాల్లో ఆయన చివరి సారిగా కన్పించారు. Read Also…