Kadapa: కడప మున్సిపల్ కార్పొరేషన్ కొత్త మేయర్ ఎన్నికకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయడంతో కార్పొరేషన్‌లో మేయర్ పదవికి పోటీపడే ఆశావహుల సంఖ్య ఎక్కువగానే కనిపిస్తోంది. బీసీకి రిజర్వుర్డ్ స్థానం కావడంతో కడప కార్పొరేషన్‌లో ఐదారుగురు బీసీ కార్పొరేటర్లు ఉన్నారు. అయితే, మోజార్టీ కార్పొరేటర్లు వైసీపీ వైపే ఉండటంతో ఎవరిని మేయర్ స్థానంలో కూర్చోబెడతారన్నది ఆసక్తిగా మారింది. మరోవైపు అవినీతి ఆరోపణలతో మేయర్ పదవి నుంచి తొలగింపునకు గురైన మాజీ మేయర్ సురేష్‌బాబు…