ఎందరో రచయితలు దర్శకులుగా రాణించి అలరించారు. వారిలో కె. ప్రత్యగాత్మ తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అనేక జనరంజకమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన కె.ప్రత్యగాత్మ, హిందీలో కె.పి.ఆత్మగానూ కొన్ని చిత్రాలు రూపొందించారు. తెలుగులో జయలలిత నటించిన తొలి చిత్రం, చివరి చిత్రం రెండూ ప్రత్యగాత్మ దర్శకత్వంలోనే రూపొందడం విశేషం! కుటుంబ కథా చిత్రాల దర్శకునిగా పేరొందిన ప్రత్యగాత్మ చివరి వరకూ అదే తీరున సాగారు. ప్రత్యగాత్మ ఇంటిపేరు కొల్లి. కానీ, ఆయన తండ్రి పేరు కోటయ్య…