(సెప్టెంబర్ 19న ‘కలియుగ కృష్ణుడు’కు 35 ఏళ్ళు) నందమూరి బాలకృష్ణ నటనాపర్వంలో 1986వ సంవత్సరం మరపురానిది, ఆయన అభిమానులు మరచిపోలేనిది. ఆ సంవత్సరం బాలయ్య ఏడు చిత్రాలలో నటించగా, మొదటి సినిమా ‘నిప్పులాంటి మనిషి’ పరాజయం పాలయింది. ఆ తరువాత వచ్చిన ఆరు చిత్రాలూ వరుసగా ఘనవిజయం సాధించాయి. అలాంటి రికార్డు తెలుగు చిత్రసీమలో మరెవ్వరికీ లేదు. ఆ విజయపరంపరలో ఐదవ చిత్రంగా విడుదలయింది ‘కలియుగ కృష్ణుడు’. 1986 సెప్టెంబర్ 19న విడుదలైన ‘కలియుగ కృష్ణుడు’ చిత్రానికి…