సరిగా ముప్పై ఐదేళ్ళ క్రితం వెంకటేశ్, అర్జున్, రాజేంద్రప్రసాద్ – ముగ్గురూ వర్ధమాన కథానాయకులుగా అలరిస్తున్నారు. వెంకటేశ్ అప్పుడప్పుడే ఆకట్టుకుంటున్నారు; అర్జున్ తనదైన యాక్షన్ తో అలరిస్తున్నారు; ఇక రాజేంద్రప్రసాద్ నవ్వుల పువ్వులు పూయిస్తూ సాగుతున్నారు. మరి ఈ క్రేజీ కాంబోలో సినిమా అంటే అది తప్పకుండా జనాన్ని ఇట్టే కట్టిపడేసేలా ఉండాలి కదా! అందుకోసం హిందీలో ఘనవిజయం సాధించిన ‘నసీబ్’ను ఎంచుకున్నారు నిర్మాతలు టి.సుబ్బరామిరెడ్డి, పి.శశిభూషణ్. వారి ‘మహేశ్వరి పరమేశ్వరి ప్రొడక్షన్స్’ పతాకంపై తెరకెక్కిన తొలి…