జుత్తాడ గ్రామంలో భయం భయంగా కాలం వెళ్లదీస్తున్నారు గ్రామస్తులు. అంతే కాక జుత్తాడ గ్రామం నిర్మానుష్యంగా మారుతోంది. ఇళ్లకు తాళాలు వేసుకుని వేరే ఊళ్లకు గ్రామస్థులు పయనమవుతున్నారు. ఘటన జరిగిన శెట్టిబలిజ వీధి లో పోలీసుల పహారా కాస్తున్నా సరే ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఉంటున్నామని మహిళలు అంటున్నారు. అంగన్వాడీ లకు, స్కూల్స్ కు తమ పిల్లలను పంపాలంటే కూడా తల్లిదండ్రులు భయపడుతున్నారు. భయం తో రాత్రుళ్లు మేల్కొనే ఉంటున్నామని గ్రామ…