హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్‌కు బిగ్‌షాక్ ఇచ్చింది.. ఉప్పల్ స్టేడియంలో నార్త్ స్టాండ్‌కు అజారుద్దీన్ పేరు తొలగించాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. హెచ్‌సీఏకు అంబుడ్స్‌మన్ జస్టిస్ ఈశ్వరయ్య ఈ ఆదేశాలు జారీ చేశారు.. తాజాగా ఈ అంశంపై అజారుద్దీన్ స్పందించారు. ఈ అంశాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.
ఈ రోజు దేశవ్యాప్తంగా ఉన్న బీసీ ఫెడరేషన్, బీసీ సంఘాల నాయకులు ఢిల్లీలో రాహుల్ గాంధీనీ కలిశామని తెలిపారు జస్టిస్ ఈశ్వరయ్య. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ జాతీయ జన గణన చేయటం లేదు… ఎలాంటి ఎంక్వయిరీ చేయకుండా అగ్రకులాలకు 10% రిజర్వేషన్లు కేటాయించిందని మండిపడ్డారు. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు చేస్తా ఉందని, మండల కమిషన్ సిఫార్సులను పట్టించుకోవడం లేదన్నారు. రామాలయం పేరుతో ఇంటింటికి అక్షింతలు పెడుతున్నారు తప్ప కుల జనగణ…