తెలంగాణలో జూనియర్ డాక్టర్లు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా.. రేపట్నుంచి విధులకు హాజరు కాబోమని జూడాలు ప్రకటించారు. గత మూడు నెలలుగా స్టైపెండ్ ఇవ్వకపోవడంతో రేపటి నుంచి జూడాలు సమ్మెకు పిలుపునిచ్చారు. కాగా.. రేపటి నుండి సమ్మె చేస్తామని ప్రభుత్వానికి వారు నోటీస్ ఇచ్చారు. ఈ క్రమంలో వైద్య సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది .రాష్ట్ర వ్యాప్తంగా వైద్య విద్యార్థులు 10 వేల మంది వరకు ఉంటారు. అందులో.. గవర్నమెంట్ హాస్పిటల్ లో ఇంటర్న్షిప్…
తెలంగాణలోని ఆదిలాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో జూనియర్ డాక్టర్లు ఆందోళన చేస్తున్నారు. రెండో రోజు రిమ్స్ మెడికల్ కాలేజీ ముందు జూనియర్ డాక్టర్లు ఆందోళన కొనసాగుతుంది.
Andhra Pradesh: ఏపీలో జూనియర్ డాక్టర్లు సమ్మెకు పిలుపునివ్వడంతో ప్రభుత్వం స్పందించింది. రాష్ట్రంలో జూనియర్ డాక్టర్ల ఉపకార వేతనం (స్టైఫండ్) పెంచుతూ వైద్య ఆరోగ్య శాఖ జీవో జారీ చేసింది. పీజీ ఫస్టియర్ విద్యార్థులకు రూ.44వేల నుంచి రూ.50,686కు, సెకండియర్ విద్యార్థులకు రూ.46వేల నుంచి రూ.53 వేలకు, థర్డ్ ఇయర్ విద్యార్థులకు రూ.48,973 నుంచి రూ.56,319కు, ఎంబీబీఎస్ విద్యార్థులకు రూ.19,589 నుంచి రూ.22,527కు స్టైఫండ్ పెంచింది. వివిధ క్యాటగిరీలు, చదువుతున్న సంవత్సరాలను బట్టి స్టైఫండ్‌లో పెంపుదల ఉంటుందని…
కేజీహెచ్ లో సమ్మెబాట పట్టారు జూడాలు. గుంటూరులో డాక్టర్ పై దాడికి నిరసనగా విధులు బహిష్కరించి ఆందోళనకు దిగ్గారు. కరోనా కష్ట కాలంలో ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న మా పై దాడులు చేయడం దారుణం అంటూ తెలిపారు. మా సేవలను గుర్తించక పోయినా పర్లేదు కానీ దాడులు చేయడం ఘోరం. మా ప్రాణాలను ఫణంగా పెట్టి ఎంతోమంది ప్రాణాలను కాపాడాం. కానీ ఇప్పుడు వరసగ వైద్యుల పై దాడులు పెరిగిపోతున్నాయి. మాకు రక్షణ లేకుండా పోయింది, మాకు…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం-జూనియర్ డాక్టర్ల మధ్య జరిగిన చర్చలు సఫలం అయ్యాయి.. దీంతో.. సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించారు జూనియర్ డాక్టర్లు.. జూడాలతో మంత్రి ఆళ్లనాని, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి చర్చలు జరిపారు.. వారి డిమాండ్లపై సానుకూలత వ్యక్తం చేశారు.. పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.. దీంతో.. సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించారు జూనియర్ డాక్టర్లు.. తమ డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపారు జూడాల ప్రతినిధులు.. కాగా, తమ డిమాండ్ల పరిష్కారం కోసం గతంలో ప్రభుత్వానికి సమ్మె నోటీసులు ఇచ్చిన జూడాలు..…
నేడు ఏపీ జూనియర్ డాక్టర్లు ఆందోళన జరుగుతుంది. తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చటం లేదంటున్న జూడాలు.. రుయా ఆసుపత్రిలో తొలుత నాన్ కొవిడ్, తర్వాత కొవిడ్ విధులను బహిష్కరించనున్నారు. కొవిడ్ ఇన్సెంటివ్లు, ఉపకార వేతనాల నుంచి కోతలు, రోగుల కుటుంబ సభ్యుల నుంచి జూడాలకు భద్రత తదితర విషయాల్లో ప్రభుత్వం దిగిరాని పక్షంలో ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. అయితే రెండు రోజుల కిందటే జూనియర్ డాక్టర్లు ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చినా పట్టించుకోకపోవడంతో ఈరోజు…
ఏపీ రాష్ట్రంలో నేటి నుంచి జూనియర్ డాక్టర్లు సమ్మె బాట పట్టనున్నారు. తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఏపీ జూనియర్ డాక్టర్లు (జూడా) సంఘం నేటి నుంచి విధుల బహిష్కరణకు పిలుపునిచ్చింది. ఫ్రంట్‌లైన్ వారియర్లందరికీ ఆరోగ్య బీమా కల్పించాలని, కొవిడ్ ప్రోత్సాహకం ఇవ్వాలని, ఆసుపత్రుల్లో భద్రతా ప్రమాణాలు పెంచాలని డిమాండు చేస్తున్నారు. కాగా ప్రభుత్వంతో జూడాలు రెండు సార్లు జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. నేడు మరోసారి ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. ఈరోజు ఆరోగ్య మంత్రి,…
సమ్మెకు సిద్ధం అవుతున్నారు సీనియర్, జూనియర్ రెసిడెంట్ వైద్యులు… ఈ మేరకు ఏపీ సర్కార్‌కు సమ్మె నోటీసులు ఇచ్చారు… ఈనెల 9వ తేదీ నుంచి విధులు బహిష్కరించాలని జూనియర్ రెసిడెంట్ వైద్యులు నిర్ణయించారు.. ఆరోగ్య బీమా, పరిహారం కల్పించాలని కోరుతున్న వైద్యులు.. జూనియర్ రెసిడెంట్ డాక్టర్లకు కోవిడ్ ప్రోత్సాహకాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.. ఆస్పత్రుల్లో భద్రతా ఏర్పాట్లు మరింత పెంచాలని కూడా మరో డిమాండ్ ఉంది.. స్టైఫండులో టీడీఎస్ కట్ చేయకూడదని కోరుతున్న వైద్యులు.. ఈ నెల…
ఏపీలో సమ్మెబాట పట్టనున్నారు జూనియర్ డాక్టర్లు. ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చిన జూనియర్ డాక్టర్లు ఈ నెల 9 వ తేదీ నుండి విధులు బహిష్కరిస్తామన్నారు. ఎమర్జెన్సీ సేవలు మినహ అన్ని బహిష్కరించనున్నారు. ఎస్ఆర్లకు స్టైఫండ్ పెంచాలని, కొవిడ్ డ్యూటీలు చేస్తున్న మెడికల్ విద్యార్థులకు ఇన్సెంటివ్స్ ఇవ్వాలని.. ఎస్ఆర్కు అందించే స్టైఫండ్ నుంచి టీడీఎస్ కటింగ్ లేకుండా చూడాలని వైద్యలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. కొవిడ్ విధులు నిర్వహించే జూనియర్ డాక్టర్లకు, ఎస్ఆర్లకు కొన్ని రోజుల…