కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అసోం సీఎంపై హైదరాబాద్‌లో కేసు నమోదు చేశారు. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. మహిళలను అవమానించేలా మాట్లాడిన హేమంతపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రేవంత్ సోమవారం పోలీసులను కోరిన సంగతి తెలిసిందే. 48గంటల పాటు చూస్తామని.. అప్పటి వరకు కేసులు పెట్టకపోతే పోలీస్ స్టేషన్ లు ముట్టడిస్తామన్నారు.…