జూబ్లీహిల్స్‌లో గులాబీ ముళ్ళు గట్టిగానే గుచ్చుకుంటున్నాయా? అభ్యర్థి ప్రకటన తర్వాత అలకలు పెరిగిపోయాయా? వాటివల్ల విజయావకాశాలు ప్రభావితం అయ్యే ప్రమాదం ఉందా? అందుకు అధిష్టానం దగ్గర విరుగుడు ఉందా? లేక వాళ్ళవల్ల ఏమవుతుందని లైట్ తీసుకుంటారా? అలిగిన నేతలు ఎవరు? పార్టీ బై పోల్ వ్యూహం ఏంటి? ఉప ఎన్నిక… జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌లో అసంతృప్తులకు ఆజ్యం పోస్తోందట. సిట్టింగ్ సీటును తిరిగి నిలబెట్టుకోవాలన్న టార్గెట్‌తో.. ఇప్పటికే డివిజన్ల వారీగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను ఇన్చార్జ్‌లుగా పెట్టింది పార్టీ.…