తెలంగాణలో ఉత్కంఠ రేకెత్తిస్తున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచారంకు నేడు తెరపడనుంది. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రచారానికి గడువు ముగియనుంది. సాయంత్రం 5 తర్వాత మైకులు, నేతల ప్రచారాలు బంద్ కానున్నాయి. సాయంత్రం నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఆంక్షలు మొదలుకానున్నాయి. నియోజకవర్గంలో 144 సెక్షన్ అమల్లోకి వస్తుంది. నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా.. 14న ఫలితాలు వెల్లడికానున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 58 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇంతమంది పోటీలో ఉన్నా ప్రధానంగా…