వయోధిక పాత్రికేయులు దండు కృష్ణవర్మ (72) శనివారం సాయంత్రం విజయవాడలో తుదిశ్వాస విడిచారు. 1950 మే 20న జన్మించిన కృష్ణవర్మ కెరీర్ ప్రారంభంలో కోరమండల్ ఫెర్టిలైజర్స్ లో మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేశారు. ఆ తర్వాత పాత్రికేయ రంగ విశిష్ఠతను గమనించి, పెద్దల సలహాతో జర్నలిస్ట్ గా మారారు. ఇండియా టుడే తెలుగు మేగజైన్ ప్రారంభ దినాలలో కొన్నేళ్ళ పాటు మద్రాసులో అందులో ఉప సంపాదకుడిగా పనిచేశారు. ఆ తర్వాత హైదరాబాద్ కేంద్రంగా ఆంధ్రప్రభ, కృష్ణాపత్రిక తదితర…