తెలంగాణ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు వాయిదా పడే అవకాశం ఉంది. ఈ పరీక్షలు పోస్ట్ పోన్ చేయక తప్పదు అంటున్నాయి ఉన్నత విద్యా మండలి వర్గాలు. ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాక 15 రోజుల గడువు ఇచ్చి ఎంసెట్ నిర్వహిస్తాము అని ఉన్నత విద్యా మండలి అధికారులు తెలిపారు. షెడ్యూల్ ప్రకారం జులై 5 నుండి 9 వరకు ఎంసెట్ జరగాలి. డిగ్రీ పరీక్షలు పూర్తయ్యాకే డిగ్రీ తో ముడి పడి ఉన్న కామన్ ఎంట్రెన్స్ లు నిర్వహిస్తారు.…