ఇటీవల తెలంగాణలోని హైడ్రా సంస్థ (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎసెట్ ప్రొడక్షన్ ఏజెన్సీ).. ఔట్ సోర్సింగ్ పద్దతిలో 200 డ్రైవర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. సోమవారం నుంచి బుధవారం ( మే 19, 21 ) వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది. ఇటీవల పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలు రాసి.. స్వల్ప మార్కుల తేడాతో దూరమైన వారికీ ప్రాధాన్యత ఇస్తున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది. దీంతో రాష్ట్రంలోని నిరుద్యోగులు ఒక్కసారిగా పోటెత్తారు. హైడ్రా…