ఈ ఏడాది ఉత్తర భారత్ అంతటా వరదలు బీభత్సం సృష్టించాయి. క్లౌడ్ బరస్ట్‌లు జరగడం.. కొండచరియలు విరిగిపడడంతో ఆస్తి, ప్రాణనష్టం ఎక్కువగా జరిగింది. ఎక్కువగా హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాలు భారీ నష్టాన్ని చూశాయి.
జమ్మూకాశ్మీర్‌లో మరోసారి క్లౌడ్ బరస్ట్ బీభత్సం సృష్టించింది. దోడాలో మేఘావృతం కారణంగా ఒక్కసారిగా ఆకస్మిక వరదలు సంభవించాయి. నలుగురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. పది ఇళ్లులు ధ్వంసమయ్యాయి.