China: చైనాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కనీసం 39 మంది మరణించినట్లు తెలుస్తోంది. మరో 9 మంది గాయాలపాలయ్యారు. తూర్పు చైనాలోని జియాంగ్జీ ప్రావిన్సులోని జిన్యు నగరంలో బుధవారం ఈ దుర్ఘటన జరిగింది. ఒక భవనంలో అగ్నిప్రమాదం జరిగింది. సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.