మాజీ ప్రధాని దేవెగౌడ చేసిన ప్రకటనపై కేరళలో రాజకీయ వివాదం నెలకొంది. కర్ణాటకలో బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు కేరళలో అధికార ఎల్‌డీఎఫ్ మిత్రపక్షమైన జేడీఎస్‌కు ఆమోదం తెలిపినట్లు జేడీఎస్ అధినేత హెచ్‌డీ దేవెగౌడ చేసిన వాదనను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ శుక్రవారం (అక్టోబర్ 20) తోసిపుచ్చారు.
మాజీ ప్రధాని, జనతాదళ్ (సెక్యులర్) అధినేత హెచ్‌డీ దేవెగౌడ సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. లోక్‌సభ ఎన్నికలకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసేందుకు చాముండేశ్వరి ఎమ్మెల్యే జీటీ దేవెగౌడ నేతృత్వంలో పార్టీ కోర్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు దేవెగౌడ ప్రకటించారు.