అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఓవైపు కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి ఎంట్రీ... మరోవైపు జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో శివుడి విగ్రహావిష్కరణ. దీంతో.. ఇవాళ ఏం జరగబోతోందన్న టెన్షన్ అక్కడి ప్రజల్లో కనిపిస్తోంది. గతం వైసీపీ ప్రభుత్వ హయాంతో పాటు.. కూటమి సర్కార్‌లోనూ తాడిపత్రి పాలిటిక్స్ కాకరేపుతూనే ఉన్నాయి.. జేసీ వర్సెస్ కేతిరెడ్డిగా ఎప్పుడూ ఏదో ఒక ఇష్యూ ఉంటూనే ఉంది.