రేపటికి, అంటే అక్టోబర్ 17కి ఆలిండియా అన్నా డీఎంకే- AIADMK ఆవిర్భవించి 50 ఏళ్లవుతుంది. దానికి ఒక రోజు ముందు తమిళనాడు మాజీ సీఎం దివంగత జయలలితకు ఆమె నెచ్చెలి శశికళ ఘన నివాళులర్పించారు. చెన్నైలోని మెరీనా బీచ్ దగ్గరున్న జయలలిత, ఎంజీఆర్ సమాధులపై పూల మాలలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఐతే, జయ సమాధి వద్ద ఆమె భావోద్వేగంతో కంటతడి పెట్టటం అందరి దృష్టిని ఆకర్శించింది. అలాగే ఆమె అక్కడకు వచ్చిన కారుపై అన్నాడీఎంకే జెండా…