అల్లుడు శ్రీను సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. సినిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండా, ఎలాంటి గొడవలకి, కాంట్రవర్సీలకీ పోకుండా సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ పోతుంటాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. తెలుగు రాష్ట్రాల్లో ఒక మోస్తరు మార్కెట్ ఉన్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి హిందీలో మాత్రం స్టార్ హీరో రేంజ్ మార్కెట్ ఉంది. సాయి శ్రీనివాస్ డబ్బింగ్ సినిమాలకి మిలియన్ల వ్యూస్…