Jawahar Navodaya: తెలంగాణలో కొత్తగా మంజూరైన ఏడు జవహర్ నవోదయ విద్యాలయాల ప్రారంభానికి సంబంధించి తాజాగా విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ, నవోదయ విద్యాలయ సమితి (NVS) ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి నవోదయ విద్యాలయ సమితి హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం నుండి ఉపాయుక్తులు శ్రీ టి. గోపాల్ కృష్ణ, టి. సూర్యప్రకాశ్, బి. చక్రపాణి హాజరయ్యారు. అలాగే పాఠశాల విద్యా…