అమెరికాలో కాల్పుల ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా ఆదివారం తెల్లవారుజామున టెక్సాస్‌లోని జాస్పర్‌లో జరిగిన ప్రోమ్ పార్టీలో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో తొమ్మిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. హ్యూస్టన్‌కు ఈశాన్యంగా 134 మైళ్ల (215 కి.మీ) దూరంలో దాదాపు 7,200 మంది జనాభా ఉన్న జాస్పర్‌లో ఈ ఘటన జరిగింది.